గ్రూప్‌–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం | Woman Died In Road Accident While Returning From Group 1 Exam In Vikarabad, Details Inside | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం

Published Mon, Jun 10 2024 9:36 AM | Last Updated on Mon, Jun 10 2024 5:44 PM

Woman Died In Road Accident

బైక్‌పై నుంచి పడి అచ్యుతాపూర్‌ 

పంచాయతీ కార్యదర్శి దుర్మరణం  

ధారూరు: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్‌ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్‌ తండాకు చెందిన బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్‌కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్‌ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. 

వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్‌ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement