Wife Commits Suicide After Husband Leaves Her 7 Days Of After Marriage - Sakshi
Sakshi News home page

ప్రేమించి.. పెళ్లయిన వారానికే వద్దంటున్నాడు..

Aug 5 2021 11:06 AM | Updated on Aug 5 2021 4:32 PM

Wife Commits Suicide After Husband Leaves Her 7 Days Of After Marriage - Sakshi

సాక్షి, ఇల్లెందు: ప్రేమించిన వ్యక్తితో పెళ్లయిందనే సంతోషం కూడా తీరకుండానే ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వరుడి తల్లిదండ్రులు, బంధువులు వధువుపై దాడిచేసి తల్లివద్దకు పంపించారు. పోలీసులు కౌన్సెలింగ్‌ చేసినా వారు వినకపోవడంతో ఇక తనకు న్యాయం జరగదని భావింన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఇల్లెందులో బుధవారం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన మద్దెబోయిన సత్యవతికి మగ దిక్కు లేదు. 22 ఏళ్ల కుమార్తె శృతితో కలిసి ఇల్లెందు పాత బస్టాండ్‌ ఏరియాలో ఉంట కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. శృతి కూడా పట్టణంలోని ఓ స్వీట్‌ షాపులో పనిచేస్తోంది.

ఈ క్రమంలో స్టేషన్‌ బస్తీకి చెందిన 23 ఏళ్ల మేకల దినేష్‌తో పరిచయం ఏర్పడింది. అతడు శృతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి వారం క్రితం పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. కొత్తగూడెంలోని రుద్రంపూర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న దినేష్‌ కుటుంబసభ్యులు కొత్తగూడెంలోనే ఉంటున్న శృతి సోదరిని, దినేష్‌ స్నేహితులను బెదిరించి అడ్రస్‌ తెలుసుకున్నారు. ఇద్దరినీ పట్టుకుని శృతిపై దాడిచేసి, తల్లి సత్యవతి వద్దకు పంపిం, దినేష్‌ను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో శృతి రెండురోజుల క్రితం ఇల్లెందు పోలీసులను ఆశ్రయింంది.

పోలీసులు దినేష్‌ కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ చేయగా, వారు ససేమిరా అన్నారు. కుటుంబసభ్యుల ఒత్తిడితో దినేష్‌ సైతం శృతిని వదిలేస్తానని చెప్పడంతో ఆమె గత్యంతరం లేక మరుగుదొడ్లను శుభ్రం చేసే ఆర్పిక్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన శృతి తల్లి ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement