ప్రియుడితో కలిసి ప్లాన్‌; భర్తకు కాఫీలో విషం 

Wife Assassinated Husband With Her Lover Giving Poison In Coffee - Sakshi

మైసూరు: భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె ప్రియున్ని మైసూరులో బన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు హత్యకు గురి కాగా, అతని భార్య ఉమా, ప్రియుడు అవినాశ్‌ పట్టుబడినవారు. వెంకటరాజు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెకు అవినాశ్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అడ్డు తొలగించుకోవాలని ఇటీవల భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చారు, అతడు స్పృహ తప్పిన సమయంలో తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top