వ్యాక్సినేషన్‌ కేం‍ద్రంలో హింస.. గన్‌తో వ్యక్తి హల్‌చల్‌

West bengal: Violence Covid Vaccination Centre Gun Video Viral - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో గురువారం వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తుండగా మధ్యలో హింస చోటుచేసుకుంది. జ‌గ‌త్ వ‌ల్ల‌భ‌పూర్‌లోని ఓ వ్యాక్సినేష‌న్ కేంద్రంలో ప్ర‌జ‌లు రెండు గ్రూపులుగా విడిపోయి ప‌ర‌స్ప‌రం క‌ర్ర‌ల‌తో దాడికి పాల్పడ్డారు. ఇందులో ఓ వ్యక్తి గన్‌తో హ‌ల్చ‌ల్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఓ కేంద్రంలో వ్యాక్సిన్‌ కోసం ప్రజలు క్యూలో నిలబడి ఎదురుచూస్తుండగా అకస్మాత్తుగా కొందరు వ్యక్తులకు మాత్రం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ వేస్తున్నారని ఆరపణలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న వాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీఎంసీ సభ్యులకే ఈ ప్రాంతంలో ప్రాధాన్యతనిస్తూ వ్యాక్సిన్‌ వేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇక వీడియోలో గ‌న్ తో క‌నిపించిన వ్య‌క్తి తృణమూల్ కార్య‌క‌ర్త‌ని బీజేపీ ఆరోపించగా పాల‌క టీఎంసీ పార్టీ ఈ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. తుపాకీతో హల్‌చల్‌ చేసిన వ్యక్తి గుర్తింపు కూడా ఇంకా నిర్ధారించలేదు. ఇక కేసులు తగ్గడంతో సాయంత్రం మూడు గంటలు.. ఐదు గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ వ్యాక్సినేష‌న్ పూర్త‌యిన సిబ్బందితో రెస్టారెంట్ల‌ను తెరిచేందుకు అనుమ‌తిస్తామని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వెల్ల‌డించారు. 

చదవండి: ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు.. కత్తితో పొడిచి అతి కిరాతకంగా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top