లోపల మహిళ శవం.. పైన కూరగాయలు | Three Family Members Assassinated Woman In Kolkata | Sakshi
Sakshi News home page

కూరగాయల సంచిలో మహిళ శవం

Aug 15 2020 8:27 PM | Updated on Aug 15 2020 8:47 PM

Three Family Members Assassinated Woman In Kolkata - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి, పైన కూరగాయలు నింపారు. దాన్ని...

కోల్‌కతా : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతా, హరిదేవ్‌పూర్‌ ఏరియాకు చెందిన 60 ఏళ్ల సుజామణి గాయెన్‌ స్థానికంగా ఉన్న ఓ గుడి దగ్గర పూలమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్‌, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్‌లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. (భూమి పూజ విషెస్‌: ‘అత్యాచారం చేసి చంపేస్తాం’)

అక్కడ తినే ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం విచక్షణా రహితంగా కొట్టి, గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి, పైన కూరగాయలు నింపారు. దాన్ని పడేయటానికి టాక్సీ డిక్కీలో ఉంచి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement