ఎమ్మెల్యేపై అనుచిత పోస్టులు..  | TDP Leader Masthan Babu Arrested | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై అనుచిత పోస్టులు.. 

Jan 23 2022 3:25 AM | Updated on Jan 23 2022 3:25 AM

TDP Leader Masthan Babu Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పొదలకూరు: ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుపై టీడీపీ నేతను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల టీడీపీ కన్వీనర్‌ తలచీరు మస్తాన్‌బాబు శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వాట్సాప్‌ గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అందులో ఎమ్మెల్యే భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై శనివారం వైఎస్సార్‌సీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

టీడీపీ హైడ్రామా! 
మస్తాన్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేదురుమల్లిలోని ఆయన వద్దకు వెళ్లి విచారణకు హాజరుకావాలని కోరారు. దీనికి మస్తాన్‌బాబు నిరాకరించి పోలీసులతోనే వాగ్వాదానికి దిగి, పోలీస్‌ జీపు కింద పడుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని గందరగోళం సృష్టించారు. ఎట్టకేలకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రేణులు స్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement