breaking news
masthan babu
-
ఎమ్మెల్యేపై అనుచిత పోస్టులు..
పొదలకూరు: ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుపై టీడీపీ నేతను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల టీడీపీ కన్వీనర్ తలచీరు మస్తాన్‌బాబు శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అందులో ఎమ్మెల్యే భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దీనిపై శనివారం వైఎస్సార్సీపీ పొదలకూరు మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ హైడ్రామా! మస్తాన్‌బాబును అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు నేదురుమల్లిలోని ఆయన వద్దకు వెళ్లి విచారణకు హాజరుకావాలని కోరారు. దీనికి మస్తాన్‌బాబు నిరాకరించి పోలీసులతోనే వాగ్వాదానికి దిగి, పోలీస్ జీపు కింద పడుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని గందరగోళం సృష్టించారు. ఎట్టకేలకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రేణులు స్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించాయి. -
మేకపాటి వ్యాఖ్యలతో ఏకీభవించిన వెంకయ్య
ఢిల్లీ: పర్వతారోహణతో దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్‌బాబుకు నేషనల్ గ్యాలెంటరీ అవార్డు ఇవ్వాలని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మస్తాన్ బాబు కుటుంబానికి కేంద్రం సాయం చేయాలని లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. పేద గిరిజన కుటుంబంలో జన్మంచిన మస్తాన్ బాబు ఎంతో శ్రమించి ఉన్నత స్థితికి చేరాడని తెలిపారు. మేకపాటి వ్యాఖ్యలకు వెంటనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. మల్లి మస్తాన్ బాబుకు అవార్డు, సాయం కేంద్ర పరిశీలనలో ఉందని లోక్ సభలో బదులిచ్చారు.