పెళ్లై 2 నెలలు కూడా కాలేదు.. నవ వరుడు ఆత్మహత్య

Tamil Nadu: Newly Wed Groom Ends Life By Consuming Poison - Sakshi

తిరువొత్తియూర్‌/తమిళనాడు: భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో నవ వరు డు ఆత్మహత్య చేసుకున్నాడు. పోవై పులియకులంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దామునగర్కు చెందిన లక్ష్మణ్‌ కుమారుడు రంజిత్‌ కుమార్‌ (27)కు కొత్తగిరి సమీపంలోని కట్టబెట్టు మడియావాడకు చెందిన యువతి(21)తో మే 23న వివాహం జరిగింది. వారం క్రితం ఇద్దరూ యువతి ఇంటికి వెళ్లారు. అయితే రంజిత్‌ కుమార్‌తో వెళ్లడానికి యువతి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం పొలంలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని కోత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు.   

కుమారుడు మృతి.. తండ్రి ఆత్మహత్య 
టీ.నగర్‌: కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోయంబత్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. వేలాండిపాళయం తిలకర్‌వీధికి చెందిన కార్తిక్‌ (36) ప్రైవేటు సంస్థ ఉద్యోగి. ఇతని మూడేళ్ల కుమారుడు కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తిక్‌ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతిచెందాడు. పీలమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top