యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా.. | Saidabad: A Family Group Attacked On Young Man And Pregnant Woman | Sakshi
Sakshi News home page

యువకుల వివాదం.. గర్భవతి అని చూడకుండా..

Apr 5 2021 8:25 AM | Updated on Apr 5 2021 10:38 AM

Saidabad: A Family Group Attacked On Young Man And Pregnant Woman - Sakshi

రాజును కొడుతున్న దృశ్యం

సాక్షి, సైదాబాద్‌: చిన్న విషయంలో చెలరేగిన వాగ్వివాదం యువకుడిపై దాడికి దారి తీసింది. సైదాబాద్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణికాలనీలో నివసించే ప్రశాంత్‌ అలియాస్‌ రాజు (24) జీహెచ్‌ఎంసీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 2న రాత్రి 9గంటలకు రాజుకు అదే ప్రాంతంలో నివసించే అహ్మద్‌తో స్వల్ప విషయమై గొడవ జరిగింది. రాజు అక్కడి నుంచి వెళ్లిన తరువాత అహ్మద్‌ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి రాజు ఇంటికి వెళ్లారు. రాజు ఎక్కడున్నాడని అడుగుతూ వారితో వచ్చిన మహిళలు రాజు వదిన గర్భవతి అయిన సలోమిని చితకబాదారు.

విషయం తెలుసుకున్న రాజు చంపాపేటలో స్నేహితుడి ఇంటి వద్ద తలదాచుకున్నాడు. మరుసటి రోజు రాజును చంపాపేటలో కలుసుకున్న అహ్మద్‌ రాజీ చేసుకుందామని సింగరేణికాలనీకి తీసుకువచ్చారు. అక్కడ అతడిపై అహ్మద్‌ అతని కుటుంబసభ్యులు కర్రలతో చితకబాదారు. ఆ దృశ్యాలను అక్కడి యువకుడు సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని అతడి వదినను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం వారి ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: బారికేడ్‌లో ఇరుక్కున్న బాలుడు
చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ఎవరీ హిడ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement