Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం

Published Thu, Sep 23 2021 7:33 AM

Road Accident In Nalgonda - Sakshi

నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్‌ మండలం​ గ్రామ శివారులో ఒక ప్రైవేటు బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్‌ బస్సుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement
 
Advertisement