 
													సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై లారీ-బొలెరో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను గుల్ బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని బొలేరో వాహనం లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
