
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో వంశీ రెడ్డి అలియాస్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకులు అంజలి, చిన్నాలు పరారీలో ఉన్నారు. నిందితులు నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠా బారి నుంచి నలుగురు యువతులను పోలీసులు రక్షించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారు కాగా.. మరో యువతి స్వస్థలం విజయవాడగా గుర్తించారు.