ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం.. | One Deceased When Boiler Exploded At Nandyal SPY Agro Factory | Sakshi
Sakshi News home page

బాయిలర్‌ పేలి కార్మికుడు మృతి

Aug 6 2020 11:33 AM | Updated on Aug 6 2020 11:41 AM

One Deceased When Boiler Exploded At Nandyal SPY Agro Factory - Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు.

ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement