Nellore District: Conflict With Wife, Scotty Set On Fire In Anger - Sakshi
Sakshi News home page

ఎంతపని చేశావ్‌.. ఎంత భార్యపై కోపం ఉంటే మాత్రం..

Jun 9 2022 1:59 PM | Updated on Jun 9 2022 8:09 PM

 Nellore District: Conflict With Wife, Scooty Set On Fire In Anger - Sakshi

భార్య మీద కోపంగా ఉన్న అబ్దుల్‌రజాక్‌ ఫూటుగా మద్యం సేవించి ఆమె స్కూటీలో బయటకు వెళ్లారు. కొంతసేపటికి స్కూటీలో పెట్రోల్‌ అయిపోయింది.

విడవలూరు(బుచ్చిరెడ్డిపాళెం) నెల్లూరు జిల్లా: భార్య మీద కోపంతో ఆమె స్కూటీకి భర్త నిప్పు పెట్టిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలోని జొన్నవాడ సర్కిల్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షేక్‌.అబ్దుల్‌ రజాక్‌ అనే వ్యక్తి సుధా అనే మహిళను గతంలో వివాహం చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో బుధవారం భార్య మీద కోపంగా ఉన్న అబ్దుల్‌రజాక్‌ ఫూటుగా మద్యం సేవించి ఆమె స్కూటీలో బయటకు వెళ్లారు. కొంతసేపటికి స్కూటీలో పెట్రోల్‌ అయిపోయింది.
చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో రెండో పెళ్లి.. చివరికి ఏం జరిగిందంటే?

దీంతో వాహనాన్ని జొన్నవాడ సర్కిల్‌ వద్ద ఉంచి ఓ బాటిల్లో పెట్రోల్‌ తీసుకొచ్చారు. ఇంతలో భార్య సుధా నుంచి ఫోన్‌ రావడంతో తాను జొన్నవాడ సర్కిల్‌ వద్ద ఉన్నట్లు తెలిపారు. వెంటనే భార్య అక్కడికి చేరుకోవడంతో ఆమెను చూసిన అబ్దుల్‌ రజాక్‌ మరింత కోపానికి గురై స్కూటీపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆమె వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రతాప్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement