కుమారుడిని ఇంట్లో వదిలేసి.. వివాహిత అదృశ్యం  | Married Woman Missing In Visakhapatnam | Sakshi
Sakshi News home page

కుమారుడిని ఇంట్లో వదిలేసి.. వివాహిత అదృశ్యం 

Jul 22 2022 5:07 PM | Updated on Jul 22 2022 5:07 PM

Married Woman Missing In Visakhapatnam - Sakshi

అదృశ్యమైన బోగ నిర్మల (ఫైల్‌) 

వివాహిత అదృశ్యమైన ఘటనపై మహారాణిపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

అల్లిపురం(విశాఖపట్నం): వివాహిత అదృశ్యమైన ఘటనపై మహారాణిపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం రామజోగిపేటకు చెందిన బోగ నిర్మల (29) ఈ నెల 18 ఉదయం 6 గంటల సమయంలో తన 9 సంవత్సరాల కుమారుడిని ఇంట్లో వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె భర్త ధర్మరాజు నగరంలో తెలిసిన వారి ఇళ్లలోను, పలు ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవటంతో మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 9440796010 ఫోన్‌ నంబర్లలో తెలియజేయాలని కోరారు.
చదవండి: బాలయ్య స్టెప్పులు.. అభిమానుల కేకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement