బాలికను ప్రేమించి.. ఆపై వంచించి.. ఆ తర్వాత తాళిని తెంచేసి.. | Man Arrested For Cheating Girl In Chittoor District | Sakshi
Sakshi News home page

బాలికను ప్రేమించి.. ఆపై వంచించి.. ఆ తర్వాత తాళిని తెంచేసి..

Feb 10 2022 4:53 PM | Updated on Feb 10 2022 4:58 PM

Man Arrested For Cheating Girl In Chittoor District - Sakshi

బాలికను ప్రేమించి.. ఆపై పెళ్లి చేసుకుని.. తరువాత వదిలేసిన ఓ వ్యక్తిని బుధవారం అరెస్ట్‌ చేసినట్లు గంగవరం సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలమనేరు సీఐ భాస్కర్‌ తెలిపారు.

గంగవరం(చిత్తూరు జిల్లా): బాలికను ప్రేమించి.. ఆపై పెళ్లి చేసుకుని.. తరువాత వదిలేసిన ఓ వ్యక్తిని బుధవారం అరెస్ట్‌ చేసినట్లు గంగవరం సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలమనేరు సీఐ భాస్కర్‌ తెలిపారు. సీఐ కథనం మేరకు.. తన కూతురు కనిపించడం లేదంటూ పెద్దపంజాణి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 3వ తేదీన పెద్దపంజాణి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయిందన్నారు. విచారణలో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి కుమారుడు నందకుమార్‌ బాలికను వెంట తీసుకెళ్లినట్లు తేలిందన్నారు.

చదవండి: వరుడి నిర్వాకం!...పీటల మీద ఆగిన పెళ్లి

అయితే ఈ నెల 8వ తేదీన వారే పోలీస్‌స్టేషన్‌లో స రెండర్‌ అయ్యారని తెలిపారు. బాలిక తెలిపిన వివరాల మేరకు నందకుమార్‌ తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించి బెంగళూరుకు తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని చెప్పిందన్నారు. కేఆర్‌పురంలో ఒక గదిని అద్దెకు తీసుకుని కొన్ని రోజుల తరువాత మెడలోని తాళిని తెంచేసి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ వదిలేశాడని తెలిపిందన్నారు. దీనికి సంబంధించి మిస్సింగ్‌ కేసును రేప్‌ కేస్‌గా మార్చి మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నింది తుడిపై పోక్సో, పలు చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. బసవరాజుకండ్రిగ వద్ద నిందితున్ని అరెస్ట్‌ చేసి పుంగునూరు కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement