భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం.. చివరికి షాకింగ్ ట్విస్ట్

కాకినాడ క్రైం: సహజీవనం చేసిన వ్యక్తి పలు దఫాలుగా రూ.1.5 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పేర్కొంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన హీనా ఖాతున్ భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. పాయరోటీ బండి పెట్టి జీవనం సాగిస్తోంది. దుమ్ములపేటలో నివాసం ఉంటున్న విజయభాస్కర్ 18 నెలల క్రితం ఆమెకు పరిచయమయ్యాడు.
చదవండి: నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో
ఆ పరిచయం వారి సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో విజయభాస్కర్ అవసరాల కోసం పలు దఫాలుగా ఖాతున్ రూ.1.5 లక్షలు ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం నుంచి విజయ భాస్కర్ తనకు కనిపించకుండా పరారయ్యాడని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.