శ్రీచైతన్యలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య  | Inter student suicide in Srichaitanya College | Sakshi
Sakshi News home page

Sri Chaitanya: శ్రీచైతన్యలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

Oct 7 2021 3:35 AM | Updated on Oct 7 2021 9:09 AM

Inter student suicide in Srichaitanya College - Sakshi

హాస్టల్‌ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 

కంకిపాడు: ఇంటర్మీడియెట్‌ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన ఘటన కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎం.స్నేహిత్‌ వర్మ (17) కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీచైతన్య శ్రీప్రభ క్యాంపస్‌లో సీనియర్‌ ఇంటర్‌ (బైపీసీ) చదువుతున్నాడు.

బుధవారం మధ్యాహ్నం హాస్టల్‌ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. 
(చదవండి: టమాటా ధర పైపైకి.. కిలో రూ.42)

Advertisement
 
Advertisement
Advertisement