భార్యతో గొడవ.. ఇంటికి నిప్పుపెట్టి.. ఆపై ఎంత పనిచేశాడంటే.. | Husband Commits Suicide Due To Allegeing With Wife In Krishna District | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవ.. ఇంటికి నిప్పుపెట్టి.. ఆపై ఎంత పనిచేశాడంటే..

Mar 27 2022 11:39 AM | Updated on Mar 27 2022 12:05 PM

Husband Commits Suicide Due To Allegeing With Wife In Krishna District - Sakshi

వెంకటేశ్వరరావు (ఫైల్‌)

భార్యతో గొడవల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి నిప్పుపెట్టి, ఆపై ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అవనిగడ్డ పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

అవనిగడ్డ(కృష్ణా జిల్లా): భార్యతో గొడవల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి నిప్పుపెట్టి, ఆపై ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అవనిగడ్డ పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ అందించిన వివరాలు ప్రకారం..  స్థానిక లంకమ్మ మాన్యంలో నివశించే వెంకటేశ్వరరావు (35)కు భార్యతో తరచూ గొడవ జరగుతుండేది.

చదవండి: ఆరేళ్ల క్రితం వివాహం.. భార్యపై అనుమానంతో..

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి, భార్య, కుటుంబసభ్యులు ఇంటి బయట ఉండగా వెంకటేశ్వరరావు లోపల పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ బీరువాలో బట్టలు బయటకు తీసి నిప్పు పెట్టి, ఆ తర్వాత ఉరివేసుకున్నాడు. బయటకు మంటలు వ్యాపించడంతో భార్య కుటుంబసభ్యులు లోపలకు వచ్చి చూడగా అప్పటికే వెంకటేశ్వరరావు మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement