gadwal Honey Trap: హనీట్రాప్‌ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు 

Honey Trap In Gadwal : Allegations On Police Political Leaders - Sakshi

సాక్షి, గద్వాల: హనీట్రాప్‌ వ్యవహారం జోగుళాంబ గద్వాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఓ ఖాకీ పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో పోలీసు అధికారికి స్నేహం ఉండటంతో.. సదరు నేతకు ఖరీదైన నజరానాలు ఇవ్వడం వంటి విషయాలు వెలుగు చూస్తుండటం కేసును మరో స్థాయికి తీసుకెళ్తుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన నియోజకవర్గ స్థాయి పోలీసు అధికారి, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి నెరపిన ‘లీలలు’ సైతం ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

ఇందులో బాధితులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు కేసులో పలుకుబడి గల నాయకుల నుంచి ఒత్తిళ్లు, పలు రకాల ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అటు తిరిగి.. ఇటు తిరిగి తమ కొంపనే ముంచుతుందనే ఉద్దేశంతో పోలీసులు అత్యవసరంగా కేసు మూసేందుకు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారులతో దోస్తానా.. హనీట్రాప్‌ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సూత్రధారులతో జిల్లాలో పనిచేస్తున్న ఓ ఖాకీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య పలు రకాల లావాదేవీలు కొనసాగినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ప్రధాన సూత్రధారికి సంబంధించి వ్యక్తిగత వేడుకలో సదరు ఖాకీ అధికారి ఖరీదైన నజరానాను ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రధాన సూత్రధారి అనుకోని విధంగా పంజరంలో చిక్కడం.. యువతులు, మహిళలతో సాగించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సదరు ఖాకీ ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో సదరు అధికారి లోలోపల మదనపడుతున్నట్లు తెలిసింది. 
చదవండి: గద్వాలలో హనీట్రాప్‌ కలకలం!.. ఫోన్‌లో 150 మంది మహిళల ఫొటోలు


వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, వెనక నిందితుడు తిరుమలేష్‌

రాజకీయ నేతల ఒత్తిళ్లు 
ఈ హనీట్రాప్‌ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడం.. పలుకుబడి గల నేతల నుంచి ఒత్తిళ్లు రావడం.. మరోవైపు కొందరు ఖాకీల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తలనొప్పిని వదిలించుకునేందుకు పోలీసులు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరిపై కేసు నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించడం, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు. అలాగే ఇందులో ఏ రాజకీయ పారీ్టకి సంబంధించిన నేతలు లేరని చెప్పారు. 

కాగా.. అసలు సూత్రధారులను వదిలి అమాయకుడైన తమ కుమారుడిని (తిరుమలేష్‌ అలియాస్‌ మహేశ్వర్‌రెడ్డి)ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపండంపై తల్లిదండ్రులు పద్మ, నారాయణలు పట్టణ పోలీసుస్టేషన్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. 

పాత అధికారులు వెలుగులోకి
ఇదిలా ఉంటే గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన ఓ ఖాకీ అధికారి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరపిన రాసలీలల వ్యవహారం కూడా గుప్పుమంది. సాధారణ ప్రజలు చేస్తే దండన విధించే పోలీసులు.. వారి శాఖలోనే పనిచేసే కొందరు ఖాకీలపై ఆరోపణలు వస్తే మాత్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ జరిపి ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన శిక్ష వేస్తేనే ఇలాంటి 
లతో సహా ఫిర్యాదు చేశారు.

కఠిన చర్యలు..  
మీరు చెబుతున్నట్లు ఈ వ్యవహారంలో పోలీసు పాత్ర ఉందనడం అవాస్తవం.  మహిళల పట్ల జరిగే ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదు. ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. అదేవిధంగా ఆధారాలు లేని ప్రచారాలను కూడా మీరు నమ్మకుండా ఇలాంటి సున్నితమైన అంశంలో సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మీరు చెప్పినట్లు ఏదైనా ఆధారాలు లభిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – రంజన్‌ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top