పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో.. | Head Master Misbehave With School Children In Nalgonda | Sakshi
Sakshi News home page

నల్గొండ: విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో విషయం బయటకు..పెద్దసారుకు బడిత పూజ

Nov 13 2021 5:05 PM | Updated on Nov 13 2021 6:23 PM

Head Master Misbehave With School Children In Nalgonda - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్‌ఎం అనిల్‌ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.

సాక్షి, హుజూర్‌నగర్‌ (నల్గొండ): గురుశిష్యుల సంబంధానికి మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు సదరు హెచ్‌ఎంను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బడితపూజ చేశారు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కొందరు విద్యార్థులు పక్క గ్రామమైన తమ్మారం ప్రాథమిక పాఠశాలకు కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు.
చదవండి: ఫేస్‌బుక్‌ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు

రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్‌ఎం అనిల్‌ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు.  దీంతో వారు హెచ్‌ఎంను నిలదీయండంతో నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆయనపై దాడిచేశారు. హెచ్‌ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్‌ఎంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు.
చదవండడి: వీడియో వైరల్‌: మైనర్‌ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement