ఐఎస్‌ఐకి రహస్యాలు చేరవేత.. ఉద్యోగి అరెస్టు

HAL Employee Arrested Over Shares Fighter Jet Details To ISI - Sakshi

రహస్యాలు చేరవేస్తున్న ఉద్యోగి అరెస్ట్‌

ముంబై:  భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటలిజెన్స్‌కు(ఐఎస్‌ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్‌ శిర్‌సాత్‌(41)నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌లో అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడ్డాడు. (చదవండి: రిపబ్లిక్‌ టీవీ సీఎఫ్‌ఓకు సమన్లు)

ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ నాసిక్‌ యూనిట్‌ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. యుద్ధ విమానాల రహస్య  సమాచారాలను పాకిస్తాన్‌కు దీపక్‌ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్‌ ఫోన్లు, ఐదు సిమ్‌ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి పదిరోజుల ఏటీఎస్‌ కస్టడీకి అనుమతించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top