Girl Molested In Nalgonda | Nalgonda District Crime News - Sakshi
Sakshi News home page

మాటు వేసి బైక్‌పై తీసుకెళ్లి... బాలికపై అత్యాచారం

Apr 9 2023 12:32 PM | Updated on Apr 9 2023 1:04 PM

Girl Molested In Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి నల్లగొండ : ఓ కామాంధుడు గిరిజన బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పీఏపల్లి మండలానికి చెందిన ఓ గిరిజన బాలిక ఈ నెల 3న బైక్‌పై పాఠశాలకు వెళ్తోంది. గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే మండల కేంద్రానికి చెందిన నారాయణదాసు రవితేజ మాటు వేసి బైక్‌ను అడ్డగించాడు. అనంతరం బాలికను కత్తితో బెదిరించి పెనుగులాడుతుంటే  కొట్టడంతో స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాధిత బాలికను బైక్‌పై గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి  పాల్పడ్డాడు. బాలికకు స్పృహ వచ్చే సరికి కొండమల్లేపల్లిలో ఉంది. విషయం తల్లిదండ్రులకు చెబితే చంపివేస్తానని నారాయణదాసు బాలికను బెదిరించాడు. 

పోలీసులకు ఫిర్యాదు చేసినా..
బాధిత బాలిక దాడి నుంచి తేరుకుని ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు వివరించి బోరుమంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఈ నెల 5వ తేదీన గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనంతరం పెద్దమనుషుల సహకారంతో బాధితురాలి తల్లిదండ్రులు శనివారం నల్లగొండ ఎస్పీ అపూర్వరావును ఆశ్రయించి గోడు వెల్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని వేడుకున్నారు. స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో ఆరోపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుడిపై 323, 341, 506, 366–అ, 376(2)N)సెక్షన్‌ల కింద  కేసు నమో దు చేసి గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కాగా, లైంగికదాడి ఘటనపై బాధితురాలు రెండు ఫిర్యాదులు ఇచ్చారని, ఒకే పిటిషన్‌ ఇవ్వాలని కోరడంతో కొంత ఆలస్యం జరిగిందని గుడిపలి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement