ఫోన్‌ మాట్లాడొద్దన్న తల్లి.. అదృశ్యమైన కూతురు  | Girl Missing In Banjara Hills Hyderabad | Sakshi
Sakshi News home page

ఫోన్‌ మాట్లాడొద్దన్న తల్లి.. అదృశ్యమైన కూతురు 

Sep 19 2022 9:34 PM | Updated on Sep 19 2022 9:45 PM

Girl Missing In Banjara Hills Hyderabad - Sakshi

దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతంలో కూడా పలుమార్లు ఇంట్లో నుంచి వెళ్లి తన స్నేహితుల వద్ద ఉండేదని ఈ సారి కూడా వస్తుందని చూడగా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): తరచూ ఫోన్‌ మాట్లాడుతున్నావని కోప్పడ్డందుకు తన కూతురు ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని బాధిత తల్లి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలివీ... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని సింగాడబస్తీలో నివసించే భీమ్‌బాయి గృహిణి. ఆమె 15 సంవత్సరాల కూతురు పూజ ఇంటర్‌ చదువుతోంది.
చదవండి: మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. రెడ్‌ హ్యండెడ్‌గా పోలీసులకు పట్టించిన భార్య

ఈ నెల 15వ తేదీన ఫోన్‌ తరచూ ఎందుకు మాట్లాడుతున్నావని అమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గతంలో కూడా పలుమార్లు ఇంట్లో నుంచి వెళ్లి తన స్నేహితుల వద్ద ఉండేదని ఈ సారి కూడా వస్తుందని చూడగా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌: 94914 87605లో సంప్రదించాలని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement