లోయలో పడ్డ బస్సు: ఐదుగురి మృతి

Bus Fell Into George 5 Died And 35 Injured In Maharashtra - Sakshi

ముంబై : బస్సు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా.. 35 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మహారాష్ట్ర, నందూర్‌బార్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్పీ మహేంద్ర పండిట్‌ తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రకు చెందిన ఓ బస్సు దాదాపు 40 మంది ప్రయాణికులతో మల్కాపూర్‌ నుంచి సూరత్‌ వెళుతోంది. బుధవారం ఉదయం నందుబార్‌లోని ఖాంఛౌన్‌ దార్‌ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో అదుపుతప్పి పక్కనే ఉన్న 80 అడుగుల లోయలోకి పడిపోయింది. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్‌ ఆచూకీ )

దీంతో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అత్యవసర వైద్యం కోసం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top