చెల్లెలు చెప్పిన మాట వినటం లేదని.. | Brother Shoots Sister For Not Listening Him In Delhi | Sakshi
Sakshi News home page

చెల్లెలు చెప్పిన మాట వినటం లేదని..

Nov 20 2020 1:17 PM | Updated on Nov 20 2020 5:40 PM

Brother Shoots Sister For Not Listening Him In Delhi - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడితో వాట్సాప్‌లో చాటింగ్‌లు, ఫోన్‌లో మాట్లాడుతోందన్న కోపంతో చెల్లెల్ని తుపాకితో కాల్చేశాడు ఓ అన్నయ్య. ఈ సంఘటన ఢిల్లీలో  గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని వెల్‌కమ్‌ ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడు ఓపెన్‌ స్కూల్లో చదువుకుంటూ, సెలూన్‌లో పని చేస్తున్నాడు. అతడి చెల్లెలు చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. సోదరి తరచుగా ఓ స్నేహితుడితో చాటింగ్‌ చేయటం, ఫోన్‌లో మాట్లాడటం అతడికి నచ్చలేదు. స్నేహితుడితో చాటింగ్‌లు, టాకింగ్‌లు మానేయాలని చాలా సార్లు చెప్పాడు. ( కాళరాత్రి నరకం: సజీవంగా పాతిపెట్టి..)

అయితే ఆమె వినలేదు. గురువారం ఉదయం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అతడు తుపాకితో చెల్లెలిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement