తోటి విద్యార్థిని హత్య చేసి డ్రైనేజీలో పడేసిన ఐదుగురు స్నేహితులు

The Body Of 21 Year Old College Student Found In Drain Near Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేసి డ్రైనేజీలో పడేశారు తోటి విద్యార్థులు. గాల్గోటియాస్‌ ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి మృతదేహం గ్రేటర్‌ నోయిడాలోని ఇన్‌స్టిట్యూట్‌కు సమీపంలోని డ్రైనేజీలో లభించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని హత్య చేసిన వారిలో ఐదుగురు విద్యార్థులను గుర్తించినట్లు చెప్పారు.

మృతుడు యశశ్వి రాజ్‌గా గుర్తించినట్లు చెప్పారు పోలీసులు. మరోవైపు.. ఐదుగురు విద్యార్థులు గొడవ పెట్టుకుని యశశ్విని దారుణంగా కొట్టి చంపేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: రాహుల్‌ ఓ ఫెయిల్డ్‌ మిసైల్‌.. కాంగ్రెస్‌ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top