పెంపుడు కుక్కకు బర్త్‌డే పార్టీ... లాకప్‌లో యజమానులు

3 arrested for celebrating pet dog birthday amid covid - Sakshi

అహ్మదాబాద్‌: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్‌ కట్‌ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్‌ పటేల్, ఉర్విష్‌ పటేల్‌లు సోదరులు. క్రిష్ణానగర్‌ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్‌లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్‌ స్పిట్జ్‌ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.

జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్‌లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్‌ మెహారియాను జైల్లో వేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top