మహిళా ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్ష జరిమానా | Sakshi
Sakshi News home page

మహిళా ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్ష జరిమానా

Published Sat, Mar 6 2021 8:42 AM

1 Lakh Fine For Woman Inspector Over Corruption - Sakshi

చెన్నై : ఫిర్యాదుకు లంచం తీసుకోవడంతో పాటు మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిన మహిళా ఇన్‌స్పెక్టర్‌కు రూ.లక్ష జరిమానాను మానవ హక్కుల కమిషనర్‌ విధించింది. విల్లుపురం జిల్లా ఇరుందై గ్రామానికి చెందిన సుందరి. ఈమె రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో 2017లో కొందరు తనపై దాడి చేసినట్టు, దీంతో తను అప్పటి తిరువళ్లూరు సీఐగా వున్న ఎలిలరసి వద్ద ఫిర్యాదు చేశాను. ఆమె కేసు నమోదు చేయడానికి ఐదువేలు లంచం అడిగారు. లంచం తీసుకున్నప్పటికీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశానని, 2018వ సంవత్సరంలో ఇంట్లో చొరబడి ఇన్‌స్పెక్టర్‌ ఎలిలరసి తనపై దాడి చేసి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించి వేధింపులకు గురి చేశారని తెలిపారు.  ఈ కారణాలతో ఆమెపై  చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యా దును పరిశీలించిన న్యాయమూర్తి జయచంద్రన్‌ సాక్షాలను, ఆధారాలను పరిశీలించి మానవ హక్కులను అతిక్రమించిన ఇన్‌స్పెక్టర్‌ ఎలిలరసికి రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement