నగరి: జగనన్న కాలు కదిలితేనే..రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్లో కదలిక వస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ కేసుకు సంబంధించి సీఐని సస్పెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం తప్పు జరిగి నట్లు అంగీకరించిందన్నారు. ‘కోర్టు తీర్పు వెలువడకముందే పోలీస్ స్టేషన్‌లోనే శిక్షలు అమలు అవుతున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? దీనిపై ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?’ అని నిలదీశారు. అలాగే ఆక్వా రైతుల సమస్యలపై స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరిక చేసిన తరువాతే ప్రభుత్వం స్పందించిందని ఫీడ్ యాజమాన్యాల తో చర్చలు జరిపేందుకు సిద్ధమైందన్నారు. జగనన్న కాలుకదపకపోతే రాష్ట్రంలో ప్రజల సమస్య లు పరిష్కారమయ్యేలా లేవన్నారు. ఆయన మా ట్లాడకపోతే ఈ రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కా రంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రతిపక్షం ఒత్తిడి చేసిన తరువాత మాత్రమే స్పందించడం సరైన విధానం కాదన్నారు. సాయికృష్ణ మరణం కస్టడీ హింస అనుమానాలకు తావిస్తోందని పోలీ సు కస్టడీలో తమ బిడ్డ హింసకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్పడం చూస్తుంటే ఈ అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అరెస్ట్, నిర్బంధం, వైద్య పరీక్షలు, సీసీటీవీ దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలు తదితర అన్ని ఆధారాలను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశా రు. విజయవాడలో చోటుచేసుకున్న గడే సాయి కృష్ణ అనుమానాస్పద మరణం, పి.క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణం జోక్యం చేసుకుని స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ చేపట్టాలని కోరారు.


