– 8లో
– 8లో
న్యూస్‌రీల్
‘పట్టాభూమిలో రోడ్డు వేస్తున్నారు’
పచ్చనేతలుతన పట్టా భూమిలో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని బాధితురాలు రేణుక వాపోయారు.
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
పేదలు తాము కష్టపడి సంపాదించిన ఆదాయంలో సగం వైద్యానికే ఖర్చు పెడుతుంటారు. వారికి మెరుగైన వైద్యం ఉచితంగా అందిస్తే జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగుపడతాయి. చిత్తూరు జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉంది. వైద్య వ్యవస్థ దారుణంగా మారింది. పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు వారినే వెక్కిరిస్తున్నాయి. ఉచిత వైద్యం అందించాల్సిన చోట నిర్లక్ష్యం తాండవం చేస్తోంది. సిబ్బంది కొరత, మందుల లేమి రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులు కరువయ్యాయి. ప్రసవాలు, సర్జరీలను రెఫర్‌తో సరిపెడుతున్నారు. దీంతో పేదల ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.
ఖాళీగా దర్శనమిస్తున్న డాక్టర్ కుర్చీ
వైద్యం.. దైన్యం
కాణిపాకం: జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు ఉన్నా యి. వీటిలో ప్రతిరోజూ 10 వేల వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఇక్కడికి వచ్చే పేదలకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మందులు కూడా లేకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో చాలా మంది ఇక్కడే వైద్యం చేయించుకుని మందులు బయట కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుంటున్నారు.
కీలక మందులు, సామగ్రి లేవు
గర్భిణులకు స్కానింగ్ అగచాట్లు
స్కానింగ్ విభాగంలో టోకెన్ విధానం అమలు చేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే స్కానింగ్ చేయడం, ఆ తర్వాత వచ్చిన వారిని తిరస్కరిస్తున్నారు. స్కానింగ్ కోసం రోజుల తరబడి తిప్పించుకుంటుండడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రసవాలకు నగదు వసూలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ఉచితంగా చేయాల్సి ఉండగా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో డెలివరీకి రూ.1000 నుంచి రూ.2000 వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. సుఖ ప్రసవాల కంటే సిజేరియన్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. కష్టతరమైన కేసులను వెంటనే ఇతర ఆస్పత్రులకు పంపించడం వల్ల గర్భిణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యుల కొరతతో అనేక సర్జరీలు జరగడం లేదు. చిన్న సమస్యలకే పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
నామమాత్రంగా అత్యవసర సేవలు
ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగులకు చికిత్స అందించాల్సిన అత్యవసర విభాగం నామమాత్రంగానే పనిచేస్తోంది. చికిత్స అందించకుండా తిరుపతి, వేలూరు ఆస్పత్రులకు రిఫర్ చేయడం సాధారణంగా మారింది. దీంతో పేదలు ఆర్థికంగా కుంగిపోతున్నారు. ఇక అక్కడ సివిల్ సర్జన్లు ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందాల్సిన మందులు దొరకడం కష్టమైంది. డాక్టర్లు రాసిన ఐదు మందుల్లో ఒకటి లేదా రెండు మాత్రలే ఉంటున్నాయి. మిగిలినవి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
పోస్టుల భర్తీ ఎప్పుడో?
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ప త్రి అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియా మకాలు జరగకపోవడంతో సేవలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగంలో 10 మంది వైద్యులు అవసరం ఉండగా ఇద్దరితోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 డాక్టర్ పోస్టులు, 50 ఫార్మసిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్‌ఎన్‌వో, ఏంఎన్‌వో సిబ్బంది దాదాపు 37 మంది అవసరం ఉంది. స్టాఫ్ నర్సులు ఆరుగురు తక్కువగా ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ల్యాబ్, స్కానింగ్ తదితర విభాగాల్లో కూడా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
కనిపించని మౌలిక సదుపాలు
ఆస్పత్రిలో కనీసం తాగునీరు కూడా అందుబాటు లో లేదు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నా యి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్లు లేకపోవడం, ఉన్న సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. పూతలపట్టు సీహెచ్‌సీలోని ఆరు విభాగాలకు నలుగురు వైద్యులు ఉండటం గమనార్హం. చిన్నపిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్ లేరు. ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడంతో వెంటిలేటర్లు మూలనపడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.


