విద్యాశాఖ ఉరుకులు.. పరుగులు! | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ ఉరుకులు.. పరుగులు!

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నిర్వహించిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘స్పాట్‌ పెట్టేశారు’! కథనం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. వందలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ అంశంపై సాక్షి గళమెత్తడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కథనం పై బుధవారం డీఈవో రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. అసలేం జరిగిందంటే... జిల్లా కేంద్రంలో జరిగిన మూల్యాంకనంలో దాదాపు 500 జవాబు పత్రాల మార్కులను ఆనన్‌లైన్‌ డేటా బేస్‌కు అనుసంధానించకుండానే మార్కులు శూన్యంగా చూపించడంతో అసలు విషయం బయటపడింది. ఈ తప్పిదం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వార్త ప్రచురితమైన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎక్కడైనా డేటా సరిగ్గా సింక్‌ కాకపోతే, వాటిని సరిదిద్దే వ్యాలిడేషన్‌ ప్రోటోకాల్‌ రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి మార్కులను రెండు సార్లు సరిచూసిన తర్వాతే తుది డేటా బేస్‌లోకి పంపామన్నారు. ఒక్క మార్కు కూడా తప్పుగా నమోదయ్యే అవకాశం లేదని తెలిపారు. వాల్యూయేషన్‌ నిర్వహణలో బాధ్యులైన సిబ్బందిపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలకు ఆదేశించామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement