ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఇంట్లో చోరీ

Apr 30 2026 7:55 AM | Updated on Apr 30 2026 7:55 AM

పాలసముద్రం : మండంలోని ఆముదాల పంచాయతీ జయలక్ష్మీపుం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ ఇంట్లో బుధవారం భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్లి బీరువా, కప్‌బోర్డులోని లాకులను పగులకొట్టి అందులో ఉన్న బంగారుం, నగదు దోచుకెళ్లినట్టు ఎస్‌ఐరాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

ఈత కొడుతూ వృద్ధుడి మృతి

బైరెడ్డిపల్లె: ఎండవేడిమి తట్టుకోలేక బైరెడ్డిపల్లె పెద్ద చెరువులో ఈత కొడుతున్న వృద్ధుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. మండలంలోని జాలారిపల్లెకు చెందిన కృష్ణప్ప (65) సయ్యద్‌హుసేన్‌లు బైరెడ్డిపల్లె పెద్ద చెరువులో ఎండ వేడిమికి తట్టుకోలేక ఈత కొట్టేందుకు వెళ్లారు. సయ్యద్‌ హుసేన్‌కు ఈత రాకపోవడంతో గట్టుపైనే నీరు ఎత్తుకొని పోసుకున్నాడు. కృష్ణప్ప ఈత కొడతానని సయ్యద్‌హుసేన్‌తో చెప్పి కొంత దూరం నీటిలోకి వెళ్లి గట్టుపైకి వస్తుండగా ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని సయ్యద్‌హుసేన్‌ సమీపంలో ఉన్న వారికి చెప్పి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు నీటిలోకి వెళ్లి కృష్ణప్ప మృతదేహాన్ని వెలికితీశారు. కృష్ణప్ప చెప్పులు కుట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దొంగలు పట్టుబడ్డారు!

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలను తాలూకా పోలీసులు పట్టుకున్నట్టు విశ్వసనీయమైన సమాచారం. గత మూడు రోజుల కిందట బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. తలుపులు పగులగొట్టి 16 తులాల బంగారం, రూ.2.5 లక్షల నగదును అపహరించుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో లోతుగా విచారణ చేపట్టి...దొంగలను చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం. గురువారం పట్టుబడ్డ దొంగలను అరెస్ట్‌ చూపించనున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

పాడుబడ్డ బావిలో పడిన కారు

పలమనేరు: రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను తప్పించబోయిన కారు పాడుబడ్డ బావిలోకి దూసుకుపోయిన ఘటన బుధవారం పలమనేరు మండలంలోని దుగ్గినవారిపల్లి వద్ద చోటుచేసుకుంది. శాంతిపురానికి చెందిన ముగ్గురు కారులో పలమనేరు వైపు వస్తుండగా దుగ్గినవారిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న వారిని తప్పించబోయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బావిలో పడ్డ కారులోని ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో రోడ్డుపై వస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మొత్తం మీద ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. తీరా చూస్తే కారులోని వాళ్లు, రోడ్డు దాటుతున్న వాళ్ల బంధువులు కావడంతో ఎలాంటి కేసులు వద్దంటూ వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement