బొప్పాయి.. వింతేనోయి! | - | Sakshi
Sakshi News home page

బొప్పాయి.. వింతేనోయి!

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

బంగారుపాళెం మండలంలోని వంకరవారిపల్లెకు చెందిన రైతు, మాజీ రైతు సంఘ నాయకుడు సుధాకర్‌రెడ్డి తన పొలంలో పండిన బొప్పాయిని ఇంటికి తీసుకొచ్చాడు. కాయను తినేందుకు కోయగా అందులో గింజలకు బదులుగా మరో తెల్లని బొప్పాయి దర్శనం ఇచ్చింది. అందులోని బొప్పాయిని కోయగా మరో బొప్పాయి ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. బొప్పాయి పండులో నల్లని గింజలు ఉండడం సాధారణం. అలాంటిది ఒకే బొప్పాయిలో మరో రెండు బొప్పాయిలు ఉండడం వింతగా అనిపించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆ బొప్పాయిని చూసి ఆశ్యర్యానికి లోనయ్యారు. ఇది జన్యుపరమైన ప్రక్రియ అని వ్యవసా యాధికారులు అంటున్నారు.

– బంగారుపాళెం

బొప్పాయి లోపల తెల్లటి బొప్పాయి

రెండో బొప్పాయిలో మరో బొప్పాయి

Advertisement
 
Advertisement
Advertisement