కొత్త ఆవిష్కరణలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కొత్త ఆవిష్కరణలే లక్ష్యం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

విద్యార్థులు కొత్తకొత్త ఆవిష్కణలే లక్ష్యంగా వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించబడుతోంది. 2026 ఏడాదిలో ఫేజ్‌–6లో భాగంగా తిరుపతిలో జిల్లా స్థాయి ఎక్స్‌పోను విజయవంతంగా నిర్వహించాం. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి రాష్ట్ర ఎక్స్‌పోకు అర్హత సాధించిన తిరుపతి, పుత్తూరు విద్యార్థులకు అభినందనలు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు రూపొందించాలి. – సి.అనిత,

ఈఎండీపీ జిల్లా కో–ఆర్డినేటర్‌, తిరుపతి

మా పాఠశాలకు గర్వకారణం

మా విద్యార్థులు కను గొన్న ప్రకృతి రోస్‌ పరిమళం రాష్ట్ర ప్రాజె క్టుగా ఎంపిక కావడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. ఇలాంటి సృజనాత్మక పరిశోధనల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి ఈఎండీపీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. మా ప్రాజెక్టు రాష్ట్ర స్థాయి ఎంపికతో మా బాధ్యత మరింత పెరిగింది. ఆ దిశగా మరింత కృషి చేస్తాం.

– కె.వి.శ్యామలత, మార్గ దర్శకురాలు,

బాలికోన్నత పాఠశాల, పుత్తూరు

పాఠ్య ప్రణాళికలో భాగం కావాలి

విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడానికి ఈఎండీపీని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. వ్యవసాయం, మత్స్య, ఆహార శుద్ధి రంగాల్లో కొత్త ఆవిష్కరణల వైపుగా విద్యార్థులను మార్గదర్శకులు ప్రోత్సహించాలి. ఈఎండీపీ తరగతుల సమయాన్ని పెంచాలి.

– వి.వెంకటరమణ,

ఈఎండీపీ జిల్లా రీసోర్స్‌పర్సన్‌, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement