పలమనేరు: రాష్ట్రంలోని సంచారజాతులకు చేసిన సేవలకు గాను పలమనేరు పట్టణానికి చెందిన సంచారజాతుల సంఘం నేత పూసల రవికి పూలే సేవా అవార్డు దక్కింది. పూలే జయంతి సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. పూసల రవి మాట్లాడుతూ తాను భవిష్యత్తులోనూ సంచారజాతుల హక్కులపై పోరాటాలు చేస్తానని తెలిపారు. ఆయనను స్థానిక బీసీ నాయకులు అభినందించారు.
మామిడితోట దగ్ధం
బైరెడ్డిపల్లె : మండలంలోని దొంతిరాళ్లపల్లె వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకు న్న అగ్నిప్రమాదంలో 3 ఎకరాల్లో ఉన్న మామిడి తోట కాలిపోయింది. దీంతో రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మాట్లాడుతూ తాను 3 ఎకరాల్లో మామిడి తోట పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం కాయదశలో ఉన్న చెట్లకు గుర్తు తెలి యని వ్యక్తులు నిప్పు పెట్టారని వాపోయారు. దీంతో చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు తెలిపా రు. కక్ష సాధింపుల్లో భాగంగా మామిడి చెట్లకు నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.


