దూడపై కుక్కల దాడి | - | Sakshi
Sakshi News home page

దూడపై కుక్కల దాడి

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

చిత్తూరు కార్పొరేషన్‌: చిత్తూరు నగరంలో కుక్కల బెదడ ఎక్కువైంది. పలు ప్రాంతాల్లోని వీధుల్లో వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. ద్విచక్ర వాహనాల్లో వెళ్తున్న వారి పై దాడిచేసి కరవడానికి ప్రయత్నిస్తున్నాయి. పిల్లలు ఒంటరిగా వెళ్లేటప్పుడు వారిపై దాడు లు చేస్తున్నా యి. మూగజీవాలపైనా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే టెలిఫోన్‌ కాలనీలో శనివారం దూడపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇటీవల నలుగురిని కుక్క కారవడంతో ఆస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్స్‌ వేసుకున్నారు. చీకటి వేళ్లలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement