తొట్టంబేడులో ముగ్గురు బదిలీ | - | Sakshi
Sakshi News home page

తొట్టంబేడులో ముగ్గురు బదిలీ

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండల పరిధిలో ముగ్గురు రెవెన్యూ అధికారులను శుక్రవారం బదిలీ చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు చెప్పిన పనులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ చోటామోటా నాయకుడు జిల్లా లోని ఆ ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేశారు. వెంటనే రెవెన్యూ డివిజనల్‌ అధికారికి ఫోన్‌ చేసి ఆ ముగ్గురిని బదిలీ చేయమని హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చేసేది లేక ఆ ముగ్గురిని కేవీబీ పురం మండలానికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటు సస్పెండ్‌కి గురైన ఓ రెవెన్యూ అధికారి టీడీపీ నాయకులకు ముడుపులు సమర్పించుకుని పోస్టింగ్‌ తెచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement