కల్యాణ మండపానికి భూవిరాళం | - | Sakshi
Sakshi News home page

కల్యాణ మండపానికి భూవిరాళం

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లికి చెందిన రత్నాబయోటెక్‌ అధినేత రత్నారెడ్డి, గంగిరెడ్డిందంపతులు యోగివేమారెడ్డి చారిటబుల్‌ ట్రస్టుకు అదే గ్రామంలో రూ.4 కోట్ల విలువైన ఎకరా 95 సెంట్ల భూమిని దానం చేశారు. దీంతో ట్రస్టు అధ్యక్షులు చెంగారెడ్డి సంఘ సభ్యులతో కలసి వారి స్వగ్రామం కొలమాసనపల్లిలో శుక్రవారం దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, నక్కపల్లి భాస్కర్‌రెడ్డి, బాలాజీరెడ్డి, రమేష్‌రెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువకుడిపై దాడి

శ్రీరంగరాజపురం : కాపు కాచి యువకుడిపై దాడి చేసిన ఘటన మండలంలోని పెద్దతయ్యూరు గ్రామం కొత్తరోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం చిన్న కుమారుడు మధుబాబు చిత్తూరులోని అమరరాజ ప్యాక్టరీలో గురువారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామం పెద్దతయ్యూరు గ్రామానికి నడిచి వెళ్తున్నాడు. అదే సమయంలో 49 కొత్తపల్లిమిట్ట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కాపు కాసి మధుబాబుపై దాడిచేసి గాయపరిచారు. గాయపడిన మధుబాబుకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు.

ఐవీఆర్‌ఎస్‌పై

అవగాహన కల్పించండి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఐవీఆర్‌ఎస్‌పై అవగాహన పెంచి..సేవలను మెరుగుపరచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఏ పరిస్థితుల్లోనూ పీహెచ్‌సీలు కనిష్ట స్థాయికి పడిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల పరిసరాల పరిశుభ్రత కోసం హెచ్‌డీఎస్‌ నిధులను వినియోగించుకోవచ్చన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఐవీఆర్‌ఎస్‌పై ప్రజలకు విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తే, వారు ఐవీఆర్‌ఎస్‌లో అనుకూల స్పందన ఇస్తారని పేర్కొన్నారు. మరణాల విశ్లేషణ (డెత్‌ అనాలసిస్‌) నివేదికలను రెండు రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రతి నెలా పీహెచ్‌సీలకు కేటాయిస్తున్న నిధులను సమర్థంగా వినియోగించాలన్నారు. అలాగే, డాక్టర్లు పీహెచ్‌సీలలో అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతర సేవలు అందించాలని, నైట్‌ డ్యూటీ నిర్వహించే సిబ్బంది శిక్షణ పొందిన స్టాఫ్‌ నర్సులే ఉండాలన్నారు. అత్యవసర రోగుల కోసం వీల్‌చైర్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.

ఎరువుల దుకాణాల్లో

ఆకస్మిక తనిఖీ

పెనుమూరు(కార్వేటినగరం): పెనుమూరు మండలంలోని ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుఖాణాలపై శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి, క్వాలిటీ కంట్రోల్‌ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ఆకస్మికంగా దారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ నకిలీ మందులు, విత్తనాలు విక్రయి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement