మెరిసిన ‘లాఠీ’ | - | Sakshi
Sakshi News home page

మెరిసిన ‘లాఠీ’

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

● మెరుగైన సేవల్లో జిల్లా పోలీసుశాఖకు ర్యాంకు ● రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు పోలీసుశాఖకు అరుదైన గౌరవం దక్కింది. పోలీసుశాఖ పనితీరులో రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసుశాఖకు మూడో స్థానం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు పెంపొందించడం, రికవరీల్లో పనితీరు ఉత్తమంగా ఉండడంతో ఈ ర్యాంకు దక్కినట్టు ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. పోలీసుశాఖ పనితీరు ఆధారంగా ర్యాంకులు వస్తుంటాయని, ఈ నెంబర్లు అనేవి శాశ్వతం కాదని తెలిపారు. కానీ ప్రజలు పోలీసుశాఖను ఏ మేరకు విశ్వసిస్తున్నారు..? ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం ఇంకా ఏం చేయాలి..? తమ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలి..? అనే ప్రశ్నలు నిత్యం ఎదురవుతాయన్నారు.

చిత్తూరులో డ్రోన్‌ కెమెరాల ద్వారా మందుబాబులను గుర్తిస్తున్న పోలీసులు (ఫైల్‌)

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చిత్తూరులో

రూ.34 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం(ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement