ఏళ్ల నాటి రికార్డులు భద్రం | - | Sakshi
Sakshi News home page

ఏళ్ల నాటి రికార్డులు భద్రం

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని మిట్టూరులో ఉన్న పాత ప్రసూతి ఆరోగ్య కేంద్రం మరోసారి ప్రత్యేకతను చాటుకుంది. అక్కడ భద్రపరిచిన ఏళ్ల నాటి జనన–మరణ రికార్డులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా ప్రారంభమైన కమ్యూనిటీ క్లినిక్‌లో ఈ పురాతన రికార్డులను ప్రదర్శనకు ఉంచారు. 1917 నుంచి 1936 వరకు రికార్డులు ఇప్పటికీ చెదరకుండా ఉండడం విశేషం. ఆ కాలంలో ఏడాదికి 300కు పైగా శిశు మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ రికార్డులు కేవలం పాత డేటా మాత్రమే కాకుండా, వైద్య రంగంలో జరిగిన మార్పులకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement