అన్నదాతకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అండగా వైఎస్‌ఆర్‌సీపీ

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

● పార్టీ కార్యాలయ ఏర్పాటును అడ్డుకోవడం దారుణం ● ఎమ్మెల్సీ భరత్‌

శాంతిపురం: అభివృద్ధి పేరుతో వేధిస్తున్న అమాయక రైతులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్‌ చెప్పారు. గురువారం మండల పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కుప్పం ప్రాంతం అభివృద్ధి చెందితే సంతోషించే వారిలో తాము ముందుంటామన్నారు. కానీ రైతులను ఒప్పించకుండా వారిపై దౌర్జ న్యం చేయడం, అధికారులను అడ్డం పెట్టుకుని వేధించడం తగదన్నారు. భూములు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పే రైతులను పోలీసులతో వేధించడం సమంజసం కాదన్నారు. సివిల్‌ మ్యాటర్లను పోలీస్‌స్టేషన్లలో ఎందుకు సెటిల్మెంట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. బాధిత రైతులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. దండికుప్పం, కర్ల గట్ట, 121 పెద్దూరుల వద్ద రైతుల నుంచి గతంలో ప్రభుత్వం తీసుకున్న భూములను వృథాగా వదిలేసి మళ్లీ వేల ఎకరా ల పంట భూములపై పడడం దారుణమన్నారు. రైతుల అంగీకారం లేకుండా వారి భూములను లాక్కోవద్దని కడ పీడీ, కుప్పం టీడీపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. గత్యంతరంలేని స్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

పార్టీ కార్యాలయానికి ఆంక్షలా ?

ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా వారి సౌలభ్యం కోసం పార్టీ కార్యాల యం పెట్టుకునే హక్కు ఉందని ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. కానీ 30 యాక్టును అడ్డం పెట్టుకుని శాంతిపురంలో తమ పార్టీ కార్యాలయ ప్రారంభాన్ని పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ వారి దయాదాక్షణ్యాలు, పోలీసు ల సహకారంతో పార్టీ కార్యాలయాన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటివి చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోదండరెడ్డి, బుల్లెట్‌ దండపాణి, కృష్ణమూర్తి, పెద్దన్న, హేమంత్‌రెడ్డి, నాగభూషణం, విజయకుమార్‌, ప్రభాకర్‌రెడ్డి, పూలకుంట భాస్కర్‌, రమేష్‌రెడ్డి, అశ్వత్‌బాబు, మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement