వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తడుకు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారం నం.2 రైల్వే ట్రాక్‌పై మంగళవారం సాయంత్రం సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు రేణిగుంట రైల్వే ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడి ఒంటిపై బ్లాక్ కలర్ షర్ట్, వంగపూత కలర్ తెలుపు గీతల ఫుల్‌షర్ట్ ధరించాడని, కుడి ఎదురొమ్ముపై నల్లని పుట్టుమచ్చ, అప్ప అను ఇంగ్లిషు అక్షరాలు, కుడిచేతిపై అంబేడ్కర్ బొమ్మ ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన రేణిగుంట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


