నేడు బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

నేడు బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని అంబేడ్కర్‌ భవనంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ సభ్యులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఎస్‌సీ, ఎస్టీ నాయకు లు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, కర్షకు లు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు.

రేపటి నుంచి

సమ్మేటివ్‌ –2 పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని యాజమా న్య పాఠశాలల్లో 1 నుంచి 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని తరగతులకు ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు, 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభు త్వం పంపిణీ చేసిన అసెస్‌మెంట్‌ పుస్త కాల్లో మాత్రమే జవాబులు రాయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 1 నుంచి 5 తరగతులకు క్లస్టర్‌ కేంద్రం నుంచి, 6 నుంచి 8వ తరగతుల కు ఎమ్మార్సీ నుంచి గంట ముందుగా ప్రశ్నాపత్రాలు అందజేస్తారు. పరీక్షల అనంతరం టీచ ర్లు జవాబు పత్రాలు/అసెస్‌మెంట్‌ బుక్‌లెట్స్‌ మూల్యాంకనం చేయనున్నారు. ఈ నెల 20వ తేదీ లోపు మార్కులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి వ్యక్తిగత, ఏకీకృత మార్కుల రిజిస్టర్‌లో నమో దు చేస్తారు. ఈ నెల 22వ తేదీలోపు విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్‌ ఆదేశించారు.

పతనమైన టమాట ధరలు

వి.కోట: టమాట ధరలు అమాంతంగా పతనమయ్యాయి. వి.కోట మార్కెట్‌లో శనివారం టమాటా 18 కిలోల బాక్సు రూ.50ల నుంచి అత్యధికంగా రూ.150 పలికింది. ధరలు తగ్గడంతో కాయలను కోసి మార్కెట్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చులు కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో కొంతమంది కాయలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు కోసిన టమాటాలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడికి చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

అధ్యాపకుడికి ఎన్‌సీసీ భారత సైన్యం లెిఫ్టినెంట్‌ పదవి

గుడిపాల: మండలంలోని సీఎన్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భౌతికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న హేమంత్‌కుమార్‌ ఎన్‌సీసీ అధికారి శిక్షణా అకాడమీ(ఓటీఏ) కాంప్టీ నాగ్‌పూర్‌లో ప్రతిష్టాత్మక సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి భారత సైన్యం నుంచి లెఫ్టినెంట్‌ పదవిని అందుకున్నారు. ఈ శిక్షణలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక ప్రణాళిక, దేశభక్తి స్పూర్తి కనబరిచారు. ఆయనను కళాశాల యాజమాన్యం అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement