నగరిలో కరియమాణిక్యస్వామి ఆలయం వద్ద, నిండ్రలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద, విజయపురంలో మాధవరం శ్రీకృష్ణ ఆలయం వద్ద నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు.
వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకు లు, కార్యకర్తలు చిత్తూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఎట్టమ్మ ఆలయం వరకు ర్యాలీ చేశారు. అక్కడ అమ్మవారికి పూజలు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసి 101 టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తిరుమల దేవస్థానానికి చెడ్డపేరు తీసుకు వస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కుప్పంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ భరత్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద ఆపార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు.
బంగారుపాళ్యంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పూతలపట్టు సమన్వయకర్త సునీల్‌కుమార్ ఆధ్వ ర్యంలో మండలం పాలేరులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వ ర్యంలో శనివారం ఆ పార్టీ నాయకులతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నిరసన తెలిపారు.
కార్వేటినగరంలో వైఎస్సార్ సీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారికి సమీపంలో నిరసన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నేతృత్వంలో శతిరుపతి రూరల్ మండలంలోని కుంట్రపాకంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి నేతృత్వంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు.
సూళ్లూరుపేట ఎంపీపీ అనీల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పార్క్ వీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
రైల్వేకోడూరులోని టోల్‌గేట్ సమీపంలో ఉన్న ప్రస న్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్‌సీపీ రైల్వేకోడూరు సమన్వయకర్త కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజలు చేశారు.
నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయ పుష్కరిణి వద్ద వైఎస్సార్ సీపీ సత్యవేడు నియో జకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో పూజలు చేసి, నిరసన తెలిపారు.
శ్రీకాళహస్తి మండలం తొండమాన్‌పురంలోని ప్రస న్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకుడు ఓడూరు గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేసిన నిరసన తెలిపారు.
వడమాలపేట : అప్పలాయగుంటలో నిరసన తెలుపుతున్న భూమన కరుణాకరరెడ్డి, ఆర్కే రోజా, నేతలు
చిత్తూరులో నిరసన ర్యాలీ చేస్తున్న విజయానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు
కుప్పంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ భరత్, నాయకులు
తిరుపతిలో నిరసన తెలుపుతున్న భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్ తదితరులు
బీఆర్ నాయుడూ చేసిన పాపాలు ఇక చాలు.. టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకో.. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయొద్దు.. ఉన్నతమైన పదవిలో ఉంటూ రాసలీలలు సాగిస్తున్న నీలాంటి అపవిత్రులకు ఆ పదవిలో కొనసాగే హక్కులేదు.. నీవు పదవి చేపట్టిన నాటి నుంచి వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయి.. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. అయ్యా.. ఇక తప్పుకో అంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు నిరసనలు చేపట్టారు. పలు ఆలయాలను శుద్ధి చేసి పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
చైర్మన్ పదవికి బీఆర్ అనర్హుడు
బీఆర్‌నాయుడు గలీజు మనిషి. ఆయన టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడు. ఆయన అరాచకాలన్నీ తెలిసే చంద్రబాబు టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఆ మహాతల్లి ఏడాదిన్నర కిందటే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు ఉత్తరాల ద్వారా బీఆర్‌నాయుడు నీచుడని, సీ్త్రలోలుడని, పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వద్దని కోరింది. అవేవి పట్టించుకోకుండా ఆయనకే చైర్మన్ పదవి కట్టబెట్టారు. అతను చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో మద్యం, మాసం విక్రయాలు, క్యూలైన్లలో భక్తుల మృతి తదితర దాష్టీకాలు జరిగాయి. వాటికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన వ్యక్తి నిస్సిగ్గుగా ఎదురుదాడి చేయడం దారుణం.
– భూమన కరుణాకరరెడ్డి,
వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు
నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో..
రాసలీలలు సాగిస్తూ పట్టుబడినా, ప్రభుత్వం, పచ్చ మీడియా అండ ఉందన్న దీమాతో బీఆర్‌నాయుడు నిస్సిగ్గుగా చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. టీటీడీ పవిత్రతను కాలరాస్తున్నారు. సనాతన హిందూ ధర్మానికి ప్రతీకై న టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌నాయుడిని ఇంకా కొనసాగిస్తూ చంద్రబా బు, పవన్‌కళ్యాణ్ అపచారం చేస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ పగటి వేషం వేసిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడెందుకు నోరు తెరవడం లేదు. బీఆర్‌నాయుడు అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.
– ఆర్కే రోజా, మాజీ మంత్రి
మీడియాపై ఆంక్షలు
చిత్తూరు కార్పొరేషన్: అక్రమ సంబందాలతో కళంకితుడైన బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా తొలగించాలని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. వారు శనివారం నాయకులు, కార్యర్తలతో కలిసి వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా ఉండడం వల్ల తిరుమల ప్రతిష్ట దిగజారుతోందని విమర్శించారు. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీకి ఒక కళంకితుడిని చైర్మన్‌గా కొనసాగించడం హిందూ సమాజాన్ని అవమానించడమేనన్నారు. ప్రభుత్వం, పచ్చ మీడియా అండగా ఉందని బీఆర్ నాయుడు అసందర్భ ప్రేలాపనలతో నిస్సిగ్గుగా పదవిని అంటి పెట్టుకున్నారని దుయ్యబట్టారు. నైతిక విలువలు ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు. గతంలో సనాత న ధర్మ పరిరక్షకులుగా పగటి వేషం వేసిన అవకాశవాదులంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.


