చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యనిధి (పీఎఫ్)కి సంబంధించి మార్చి నెలాఖరు వరకు ఉన్న బకాయిలు రూ.273 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్టు జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రుణాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి అందజేసే తుది మొత్తాల పూర్తి బకాయిలను ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ పరిష్కరించినట్లు చెప్పారు. పీఎఫ్‌కు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో చూసుకోవాలని, ఏవైనా సమ స్యలు ఉంటే కార్యాలయ పనివేళల్లో వచ్చి పరిష్కరించుకోవచ్చునని వివరించారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులకు సంబంధించిన గౌరవ వేతనం రూ.15.60 లక్షలు చెల్లించామని తెలిపారు.


