నగరి: స్థానిక జామి యా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు ఘర్ష ణ పడ్డారు. మసీదు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు విడివిడిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరో వర్గంపై ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ మల్లికార్జున తెలిపిన కథనం మేరకు.. గతంలో మసీదులో చందాల వసూళ్ల విషయంలో గోడవలు రాగా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. అనంతరం ఒక వర్గం వారు వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తెచ్చుకొని కమిటీని ఏర్పాటుచేసుకున్నారు. దీనిపై మరో వర్గం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. ఈ దశలో కమిటీ ఏర్పాటు చేసుకున్న వారు చందాల వసూలుకు ప్రయత్నించగా మరో వర్గం స్టేటస్‌కో ఇస్తే ఇంకా కమిటీ నిర్ధారణ కానట్లే అని చందాలు వసూలు చేయకూడదంటూ అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వారు గొడవపడ్డారు. చందాలు వసూలు చేయడమే గొడవకు కారణమైందని సీఐ తెలిపారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బైండోవర్ నమోదు చేస్తామన్నారు.


