టమాట లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

టమాట లారీ బోల్తా

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

– 8లో

యాదమరి మండలంలోని పీలేరు–చిత్తూరు జాతీయ రహదారిపై టమాట లారీ బోల్తాపడింది.
‘ఆరోగ్య’ పర్యవేక్షణ తప్పనిసరి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కచ్చితమైన పర్యవేక్షణ అవసరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఏ.నాగశశిభూషణ్‌రెడ్డి సూచించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీహెచ్‌సీల్లో అందించే ఆరోగ్య సేవలపై ప్రజల స్పందనను ఐవీఆర్‌ఎస్‌ ద్వారా 100 శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓపీ రోగుల నమోదు, అభ ఐడీ లింకేజీ వివరాలను ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డ్స్‌లో రోజువారీగా నమోదు చేయాలని సూచించారు. మాతృ, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాతృ మరణాలు, శిశు మరణాలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలన్నారు. టీనేజ్‌ గర్భదారణలు ప్రస్తుతం 11 శాతంగా ఉన్నందున అవగాహన కార్యక్రమాల ద్వారా వాటిని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రాజెక్ట్‌ కింద పీ, ఎల్‌, ఎస్‌ ఫారాలను అభ ఐడీ లింకేజీతో ప్రతిరోజూ పంపాలని ఆదేశించారు. ఏ సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా బ్రెస్ట్‌, ఓరల్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ అనుమానిత కేసులను వారానికి కనీసం 75 కేసులు గుర్తించి వైద్యులకు పంపించాలని చెప్పారు. అవసరమైన వారికి రెఫరల్‌ ద్వారా చికిత్స అందించాలని సూచించారు. గర్భిణీ సీ్త్రలందరికీ అభ ఐడీ లింకేజీ తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం 79 శాతంగా ఉన్నదాన్ని 100 శాతానికి తీసుకురావాలని ఆదేశించారు. డాక్టర్లు ప్రతిరోజూ కార్యక్రమాలను పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని తెలిపారు. పీహెచ్‌సీలకు విడుదల చేసిన నిధులను వినియోగించి బిల్లులను సమర్పించాలని సూచించారు. అలాగే వడదెబ్బ, వడగాల్పులపై గ్రామ స్థాయిలో వి స్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సూచనల్లో ఎలాంటి లోపాలు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement