సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు
నారాయణవనం: నడుస్తున్న టెక్నాలజీ యుగంలో సాంకేతిక పరిశోధనలతో మంచి గుర్తింపును, అవకాశాలను అందుకోవచ్చని పలువురు పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబిలీ వార్షికోత్సవాల్లో శుక్రవారం వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, నిపుణుల, అతిథుల ఉపన్యాసాలు జరిగాయి. ప్రముఖ టెక్నాలజీ పరిశ్రమలు, అకాడమిక్ రంగాల నిపుణులు ఎజిల్‌వన్ (చైన్నె), తిరుపతి ఐఐటీ నిపుణులు విఘ్నేష్, వెంకటయ్య, కౌటిల్య శ్రీ ధర్, రాజేంద్ర ప్రసాంత్ (ఐఐఐటీ శ్రీసిటీ), వైలూరు పెరుమాలు (ఐటీ కన్సల్టెంట్ డెలాయిట్)లు ఆధునిక సాంకేతికత, పరిశ్రమ అవసరాలు, పరిశోధన అవకాశాలు, వృత్తి నైపుణ్యతాభివృద్ధి తదితర అంశాలపై విద్యార్థులు, అధ్యాపకులు చర్చించారు. కార్యక్రమాలు పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు పేర్కొన్నారు.


