దోచేసి.. దాచేసి.. దాటించి! | - | Sakshi
Sakshi News home page

దోచేసి.. దాచేసి.. దాటించి!

Jan 25 2026 7:15 AM | Updated on Jan 25 2026 7:15 AM

దోచేస

దోచేసి.. దాచేసి.. దాటించి!

● చిత్తూరు మండలంలో రెచ్చిపోతున్న కూటమి నేతలు ● ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● కుప్పలు తెప్పలుగా ఇసుక డంప్‌లు ● అదును చూసి తమిళనాడుకు తరలింపులు ● అక్రమ రవాణాను పట్టించుకోని అధికారులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ఇసుక అక్రమ రవాణాకు చిత్తూ రు కేంద్ర బిందువుగా మారింది. మండలంలోని ఆనగల్లు, ముత్తుకూరు, బీఎన్‌ఆర్‌ పేట, అనంతాపురం రీచ్‌లున్నాయి. ప్రస్తుతం అనంతాపురం తప్ప మిగిలిన వంకల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించడంతో తమ్ముళ్లు ఇదే అదునుగా అక్రమ రవాణా సాగిస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. ఆనగ ల్లు, ముత్తుకూరు, బీఎన్‌ఆర్‌పేట వంకల్లో ఇష్టారా జ్యంగా యంత్రాలు పెట్టి ఇసుకను తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దండుకుంటున్నారు.

సామాన్యులకు ఇక్కట్లు

ఇసుక ట్రాక్టర్లలన్నీ కూడా డంప్‌లపైనే ఆధారపడుతున్నాయి. వంకల నుంచి డంప్‌కు ఇసుక తరలించే ట్రాక్టర్‌కు రూ.2,200(లోడ్‌కు) ముడుతోంది. దీంతో ట్రాక్టర్లన్నీ డంప్‌ల వైపే చూస్తున్నాయి. సామాన్యులకు ఇసుక తలించేందుకు మొగ్గు చూపడం లేదు. గతంలో లోడ్‌ ఇసుక రూ.1000 నుంచి రూ.1,200లకే తరలించేవారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరుపై మండిపడుతన్నారు.

ఆ ఇద్దరిదే హవా..!

ఇసుక అక్రమ వ్యాపారంలో గుడిపాల మండలానికి చెందిన ఇద్దరు యువ నేతలదే హవా నడుస్తోంది. ఇందులో ఒకరు, టీడీపీ, మరొకరు జనసేన. వీరి కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ సాగుతోంది. వీరిని కాదని వేరేవాళ్లు ఇసుక జోలికి వెళితే కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఓ సామాన్య కార్యకర్త ట్రాక్టర్‌ ద్వారా తమిళనాడుకు ఇసుక తరలిస్తుంటే ఈ ఇద్దరు నేతలే స్వయంగా పోలీసులకు పట్టించడం గమనార్హం.

అడవిచేనులోని డంప్‌

చిత్తూరు మండలం ముత్తుకూరు వద్ద ఇసుక డంప్‌

ఇసుక అక్రమ రవాణాకు చిత్తూరు మండలం అడ్డాగా మారిపోయింది. కూటమికి చెందిన ఇద్దరు యువ నేతల కనుసన్నల్లో మాఫియా రాజ్యమేలుతోంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించి కుప్పలు తెప్పలుగా నిల్వ చేస్తోంది. అదును చూసి దాచిపెట్టిన తెల్లబంగారాన్ని తమిళనాడుకు తరలించేస్తోంది. అధికారుల అండతో రూ.కోట్లు కూడబెట్టుకుంటోంది. ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతోంది. అడ్డుకోవాలని యత్నిస్తే దాడులకు పాల్పడుతోంది.

ఎక్కడ చూసినా డంప్‌లే!

మండలంలోని మూడు వంకల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలు సాగించి దాచిపెట్టుకుంటున్నారు. ముత్తుకూరు సమీపంలోని చిత్తూరు–తచ్చూరు రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఓడంప్‌ కొత్తగా ఏర్పాటు చేశారు. నెల రోజులకు క్రితం ఈడంప్‌కు పూజ చేశారు. రెండు రోజులు ఇసుక తరలింపులు జరిగేలోపు వార్తా పత్రికల్లో కథనాలొచ్చాయి. దీంతో నిలుపుదల చేసినట్లు చేసి..మళ్లీరెండురోజులుగా ఈ డంప్‌ నుంచి వ్యాపారం మొదలుపెట్టారు. అలాగే చిత్తూరు–గుడిపాల మండల సరిహద్ధులోని మంచినీళ్లకుంటలో భారీ డంప్‌ ఉంది. ఇక్కడ టన్నులు..టన్నులుగా ఇసుకను దాచిపెడుతున్నారు. మళ్లీ సీఎం కండ్రిగ వద్ద ఇసుక నిల్వ చేశారు. ఈ మధ్యలో తుమ్మింద పంచాయతీ అడవిచేనులో ఇంటి నిర్మాణం పేరుతో మరో డంప్‌ ఏర్పాటు చేసుకున్నారు.

అడ్డదారిలో రవాణా

ఇసుకను అడ్డదారుల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు.. గుడిపాల మండలం రామాపురం, కమ్మతిమ్మపల్లి, బొమ్మసముద్రం మీదుగా వేలూ రు, కాట్పాడి, చైన్నెకి రవాణా చేసేస్తున్నారు. టీడీపీ నేతల టిప్పర్లలోనే స్మగ్లింగ యథేచ్ఛగా సాగుతోంది. ఒక్క లోడ్‌ ఇసుకను రూ. 1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు అమ్మేస్తున్నారు. ఇలా రోసూ 20 నుంచి 30 టిప్పర్ల వరకు హద్దులను దాటిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాగే అడవి చేను డంప్‌ నుంచి తమిళనాడులోని లత్తేరి, పరదరామి, కాట్పాడికి లారీలు రాత్రిపూట పరుగులు పెడుతున్నాయి.

దోచేసి.. దాచేసి.. దాటించి!1
1/1

దోచేసి.. దాచేసి.. దాటించి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement